H1B Visa Fee Controversy Explained :అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే హెచ్-1బీ వీసాల రుసుమును ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లకు పెంచడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఉద్యోగార్థులపై ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు తక్షణం యూఎస్‌కు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ మెయిళ్లు పంపుతున్నాయి. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టతనిచ్చారు. హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని చెప్పారు. ఈ విషయం గురించి భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం +1-202-550-9931 నంబర్‌కు ఫోన్ లేదా వాట్సప్ చేయాలని సూచించింది.

In a shocking move, U.S. President Donald Trump has announced a massive hike in H-1B visa fees, raising it to $100,000. This decision has created a global stir, especially among Indian tech workers and job aspirants planning to work in the United States.

However, White House Press Secretary Karoline Leavitt clarified on X that this is not an annual fee, but rather a one-time application charge during the H-1B filing process.

Meanwhile, several U.S.-based tech companies are urging employees to travel immediately before the new rules take full effect. To assist applicants, the Indian Embassy in the U.S. has launched a dedicated helpline for support:
📞 +1-202-550-9931 (Phone/WhatsApp).

Stay tuned for more updates on H-1B visa changes, U.S. immigration policies, and their impact on Indian professionals.

#H1BVisa #DonaldTrump #USVisa #USImmigration #IndiansInUSA #TechJobsUSA #H1B2025 #USImmigration

~PR.358~HT.286~